సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-03T10:45:24+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపుని చ్చారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

మేయర్‌ సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 2: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపుని చ్చారు. ఆదివారం 10గంటలకు 10నిమిషాలు కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్‌లో కార్పొరేటర్‌ తోటరాములతో కలిసి పలు ఇళ్లలో నిరుపయోగంగా  కూలర్లు, నీటి తొట్టీలు, పాత టైర్లలో నిలిచి ఉన్న నీటిని పారపోయించారు. నిలువ ఉండే నీటిలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలుతాయని చెప్పారు. ప్రజలు సహకరిస్తే నగరం ఆరోగ్యనగరంగా మారుతుందని అన్నారు. 


టీఆర్‌ఎస్‌వీ శుభాకాంక్షలు..

ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌వీ నాయకులు మేయర్‌ సునీల్‌రావును ఆయన కార్యాలయంలో కలిసి ఫ్రెండ్‌షిప్‌ బ్రాడ్జ్‌ను కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-08-03T10:45:24+05:30 IST