శానిటైజర్ల అమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-07T11:34:54+05:30 IST

శానిటైజర్ల అమ్మకాలపై దుకాణదా రులు అప్రమత్తతో వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా అన్నారు.

శానిటైజర్ల అమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలి

అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా


అమలాపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): శానిటైజర్ల అమ్మకాలపై దుకాణదా రులు అప్రమత్తతో వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా అన్నారు. అధిక సంఖ్యలో శానిటైజర్లు కొనుగోలు చేసేవారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


అన్ని ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. ఎవరైనా శానిటైజర్‌ తాగుతున్నట్టు తెలిస్తే సమాచారమివ్వా లని, అటువంటి వారికి కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు. ఆదేశాలు అతిక్రమించి శాని టైజర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి, నిర్వాహ కులపై బైండోవర్‌ కేసులు నమోదుచేశామన్నారు. అనంతరం స్థానిక హైస్కూల్‌ సెంటర్‌లోని మందుల షాపుల్లో శానిటైజర్ల విక్రయాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్‌కే బాజీలాల్‌, తాలూకా సీఐ జి.సురేష్‌బాబు, ఎస్‌ఐ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.


వినియోగంపై అవగాహన కల్పించాలి

కడియం: శానిటైజర్‌ల అమ్మకాలు, వినియోగంపై దృష్టి సారించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాజమహేంద్రవరం సౌత్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టేషన్‌ సీఐ గిరిజా సత్యకుమారి సూచించారు. కడియం సచివాలయం వద్ద సిబ్బందికి, వలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం ప్రియలు తాగుడు మానేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు పెంచిందని, షాపుల వద్ద కొనుగోలుదారులను దృష్లిలో ఉంచుకుని సమయం పెంచినట్టు తెలిపారు.  సారా అక్రమ తయారీ, అమ్మకాలపై నిఘా ఉంచి తమకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T11:34:54+05:30 IST