Abn logo
Sep 27 2021 @ 01:15AM

అధిక వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ జి రవి

జగిత్యాల ,సెప్టెంబరు 26: జిల్లాలో రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జి.రవి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసు  ఉన్నతఽధికారులు, నీటి పారుదల అధికారు లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  కలెక్టర్‌   అదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నం దున తగు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఎప్పటికప్పుడు అఽధికారులు అప్రమ త్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే 08724-222204 నంబర్‌ లో సంప్రదించాలని సూచించారు. జిల్లా  అధికారులు హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండాలన్నా రు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మున్సిపాలీటిలు, పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనితి ఆదేశించారు. అనుక్షణం అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.