అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-21T05:40:10+05:30 IST

గత వారం రోజులుగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారం ముగిశాయి.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పోస్టర్లను విడుదల చేస్తున్న అధికారులు

మడకశిర అర్బన, ఏప్రిల్‌ 20: గత వారం రోజులుగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా స్థానిక అగ్నిమాపక కేంద్రంలో స మావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిషత ఏఓ నరసింహమూర్తి హాజరై మాట్లాడారు. అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదాలపై అందించిన సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కలిగి ఉంటే విలువైన ఆస్తులు, వస్తువులతో పాటు ప్రాణాపాయం నుంచి కూడా బయటపడవ చ్చన్నారు. విధి నిర్వహణలో భా గంగా అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలపట్ల ఆయన అభినందించారు. అగ్నిప్రమాదాలపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపకాధికారి విజయ్‌కుమార్‌, సిబ్బంది శ్రీనివాసులు, గంగాద్రి, పణి, హరి,మంజు, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-21T05:40:10+05:30 IST