అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-17T05:54:47+05:30 IST

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉం డాలని ఏడీఎ్‌ఫఓ కేపీ లింగమయ్య పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని అమృత రెసిడెన్సీలో అగ్నిప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
గుంతకల్లులో మాక్‌డ్రిల్‌ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 16: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉం డాలని ఏడీఎ్‌ఫఓ కేపీ లింగమయ్య పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని అమృత రెసిడెన్సీలో అగ్నిప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే సమయంలో అప్రమత్తంగా ఉంటే నివారించుకోవచ్చన్నారు. గ్యాస్‌ సిలెండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు వ్యాపిస్తే నివారించుకునే విధానాన్ని ప్రదర్శన ద్వారా చూపించారు. అగ్నిప్రమాదాలు జరిగితే 101కు సమాచారమివ్వాలన్నారు.


ఉరవకొండ: పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా సిబ్బం ది చేపట్టిన మాక్‌డ్రిల్‌ ఆకట్టుకుంది. స్థానిక కణేకల్‌ రోడ్డులో శుక్రవారం అ గ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చే శారు. అగ్నిమాపకసిబ్బంది మాక్‌డ్రిల్‌ను ప్రదర్శించారు. అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 


తాడిపత్రి టౌన : పట్టణంలో అగ్నిమాపకశాఖ వారోత్సవాలు మూడోరోజు శుక్రవారం కొనసాగాయి. బుగ్గయ్యకాంపౌండ్‌ సమీపంలో ఉన్న కేకే అపార్ట్‌మెంట్స్‌లో గ్యాస్‌సిలిండర్ల ప్రమాదం జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గృహిణులకు ఫైర్‌ ఆఫీసర్‌ రామాంజనేయులు ఆధ్వర్యం లో సిబ్బంది మాక్‌డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఫైర్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ఇంట్లో గ్యాస్‌ ప్రమాదాలు జరిగినప్పుడు కంగారుపడకుండా వెంటనే విద్యుతసరఫరాను నిలిపివేయాలన్నారు. కిటికీలు, డోర్‌ల ను తెరిచి ఉంచాలన్నారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆయన  సూచించారు.  


రాయదుర్గం టౌన: అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా వుండాలని అగ్నిమాపక శాఖ అధికారి మహమ్మద్‌ సాదిక్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కోతిగుట్టలో శుక్రవారం అగ్నిప్రమాదాల నివారణపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు.  అనంతరం మాక్‌డ్రిల్‌ విన్యాసాలను ప్రదర్శించారు. జాగ్రత్త వహిస్తే ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చన్నారు.


కళ్యాణదుర్గం : గ్యాస్‌ సిలిండర్ల వినియోగం, వాటివల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కొనే విధాలనాలపై అగ్నిమాపక కేంద్రం అధికారి నజీర్‌అహ్మద్‌  శుక్రవారం స్థానికంగా మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:54:47+05:30 IST