Abn logo
Aug 7 2020 @ 00:01AM

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా


ఆసిఫాబాద్‌, ఆగస్టు6: కరోనా కేసులు పెరుగుతున్నందున గిరిజన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదివాసీ సంఘాల నాయ కులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలకు రాయిసెంటర్ల ద్వారా అవగాహన కల్పించి తగు సూచనలు ఇవ్వాలన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పీహెచ్‌సీలకు వెళ్లి పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించి   భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి రాంబాబు, డీఆర్వో కదం సురేష్‌, ఆర్డీఓ సిడాం దత్తు పాల్గొన్నారు.

Advertisement
Advertisement