తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-11T04:34:20+05:30 IST

పంటలకు సోకే తెగుళ్ల పట్ల రైతులు అప్రమ త్తంగా ఉండాలని పులి వెందుల ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రా రెడ్డి రైతులకు సూచిం చారు.

తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అరటికి సోకిన సిగటోకా ఆకుమచ్చ తెగులు

రైతులకు ఉద్యానశాఖాధికారుల సూచన 

లింగాల, జనవరి 10: పంటలకు సోకే తెగుళ్ల పట్ల రైతులు అప్రమ త్తంగా ఉండాలని పులి వెందుల ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రా రెడ్డి రైతులకు సూచిం చారు. సిగటోకా ఆకు మచ్చ తెగులు అరటి పంటకు సోకుతుందన్నారు. తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు మచ్చలు ఈనెల వెంబడి ఏర్పడతాయన్నారు. తర్వాత గోధుమ రంగుకు మారి కంచె ఆకారంలో వృద్ధి చెందుతాయన్నారు.

ఈ మచ్చ ల మధ్య భాగంలో గోధుమ రంగు దాని చుట్టూ పసుపు రంగు మచ్చ లు ఏర్పడతాయన్నారు. మచ్చలన్నీ కలిసిపోయి ఆకు అంతా ఎండిపో తుంది. గెలవేయక ముందు ఈ తెగులు ఆశిస్తే పెరుగుదల మందగిం చి గెల సరిగా వృద్ధి చెందదన్నారు. గెల వేసిన తర్వాత వస్తే కాయ సైజు తగ్గిపోతుందని, కొన్ని కాయలు మాగటం ప్రారంభమవుతా యన్నారు.

మొక్కలను దగ్గర దగ్గరగా నాటడం వలన తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. తెగులు సోకిన ఆకులను మందు పిచికారీ చేసిన తర్వాత మాత్రమే కోసి తోటకు దూరంగా వేసి కాల్చివేయాలన్నారు. వీలైనంత వరకు తోటలోని తేమ ఆధారంగా నీటి తడులను ఇవ్వాలన్నారు. ఇంకా రైతులకు ఏర్పడే అనుమానాలపై సూచనల కోసం కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-01-11T04:34:20+05:30 IST