Abn logo
Sep 26 2021 @ 00:41AM

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

మత్స్యకారులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ ఈశ్వరరావు

తహసీల్దార్‌ ఈశ్వరరావు

భీమునిపట్నం, సెప్టెంబరు 25: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారిన నేపథ్యంలో తీర ప్రాంత మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని భీమిలి తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు సూచించారు. శనివారం సాయంత్రం మంగమారిపేట తీరంలో నాలుగో వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి ఏడుకొండలరావుతో కలిసి ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. గులాబ్‌ తుఫాన్‌ కారణంగా తీరంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏ విధమైన సమస్యలు ఎదురైనా తమ కార్యాలయానికి సమాచారం అందించాలని, తమ కార్యాలయంలో ప్రత్యేకంగా సైక్లోన్‌ సెల్‌ ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైతే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మేరుగు చిన్నారావు, ఎం.అప్పన్న, దూడ అచ్యుతరావు, నల్లబాబు, తదితరులు పాల్గొన్నారు. కాగా భీమిలి జోనల్‌ కార్యాలయంలో జెడ్సీ ఎస్వీ రమణ అధికారులతో తుఫాన్‌ నేపధ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి శనివారం రాత్రి, ఆదివారం నిరంతరంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, శానిటేషన్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.