Abn logo
Sep 18 2021 @ 22:43PM

ఆస్తి పన్ను వసూలుకు సన్నద్ధం కండి!

సమీక్ష నిర్వహిస్తున్న మున్సిపల్‌ ఆర్‌జేడీ శ్రీనివాసరావు

ఆర్‌డీఎం శ్రీనివాసరావు

గూడూరు, సెప్టెంబరు 18: రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా ఆస్తి పన్నుల వసూలుకుసిద్ధంగా ఉండాలని గుంటూరు రీజియన్‌లోని మున్సిపాలిటీల డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్‌లతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  యూజర్‌ చార్జీలను, పన్ను బకాయిలను సకాలంలో వసూలు చేయాలన్నారు. అనంతరం పలు సచివాలయాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నరేంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు.