భక్తులతో మర్యాదగా వ్యవహరించండి

ABN , First Publish Date - 2021-10-19T04:31:53+05:30 IST

అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ బందోబస్తుపై సమీక్షించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 21 సెక్టార్లలో విధులు నిర్వహించే వారికి ఇన్‌చార్జిలను నియమించాలని సూచించారు. ఎస్పీ దీపికాపాటిల్‌ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వద్దన్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు.

భక్తులతో మర్యాదగా వ్యవహరించండి
అమ్మవారిని దర్శించుకుంటున్న డీఐజీ రంగారావు





 డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

విజయనగరం క్రైం, అక్టోబరు 18: అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ బందోబస్తుపై సమీక్షించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 21 సెక్టార్లలో విధులు నిర్వహించే వారికి ఇన్‌చార్జిలను నియమించాలని సూచించారు. ఎస్పీ దీపికాపాటిల్‌ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వద్దన్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. డబుల్‌ మాస్క్‌ ధరించడంతో పాటు శానిటైజర్‌ని వెంట ఉంచుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా కంట్రోల్‌ రూమ్‌నకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. సిరిమానోత్సవం ముగిసే వరకూ విధులు కొనసాగించాలన్నారు. ఆదేశాలిచ్చే వరకూ బాధ్యతలు అప్పగించిన ప్రదేశాన్ని విడిచి వెళ్లొద్దని ఎస్పీ ఆదేశించారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం డీఐజీతో పాటు ఎస్పీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట ఏఎస్పీ సత్యనారాయణరావు, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, డీఎస్పీలు అనిల్‌కుమార్‌, ఎల్‌.మోహనరావు, బి.మోహనరావు, సుభాష్‌, త్రినాథ్‌, ఆర్‌.శ్రీనివాసరావు, శేషాద్రి, ఆస్మాన్‌ పరహీన్‌, వెంకట అప్పారావు, బాలరాజు తదితరులున్నారు.  



Updated Date - 2021-10-19T04:31:53+05:30 IST