ఆ షేర్లతో జర జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-04-10T06:41:40+05:30 IST

పెద్దగా ట్రేడింగ్‌ లేని (ఇల్లిక్విడ్‌) అల్లాటప్పా కంపెనీల షేర్లతో అప్రమత్తంగా ఉండాలని దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు.. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ మదుపరులను మరోసారి హెచ్చరించాయి. ప్రస్తుతం బీఎ్‌సఈలో 299, ఎన్‌ఎ్‌సఈలో 13 ఇలాంటి కంపెనీల షేర్లు

ఆ షేర్లతో జర జాగ్రత్త!

కారుచౌక  అని కొంటే అమ్మడం కష్టం 

ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసిన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ


న్యూఢిల్లీ: పెద్దగా ట్రేడింగ్‌ లేని (ఇల్లిక్విడ్‌) అల్లాటప్పా కంపెనీల షేర్లతో అప్రమత్తంగా ఉండాలని దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు.. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ మదుపరులను మరోసారి హెచ్చరించాయి. ప్రస్తుతం బీఎ్‌సఈలో 299, ఎన్‌ఎ్‌సఈలో 13 ఇలాంటి కంపెనీల షేర్లు ఉన్నట్టు తెలిపాయి. ఇందులో ఎక్కువ భాగం ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన కంపెనీల షేర్లే ఉండ టం గమనార్హం. పొరపాటుగా కూడా ఇలాంటి అల్లాటప్పా కంపెనీల షేర్లలో మదుపు చేయవద్దని ఇన్వెస్టర్లను కోరాయి. ట్రేడర్లు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఒకసారి ఈ కంపెనీల షేర్లలో మదుపు చేస్తే..వాటిని తిరిగి అమ్ముకోవడం కష్టమని ఇన్వెస్టర్లకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ను పరిశీలించి 312 కంపెనీల షేర్లను  ట్రేడింగ్‌ జరగని షేర్లుగా గుర్తించాయి.  


కొత్త విండో: ఇల్లిక్విడ్‌ షేర్లుగా గుర్తించిన ఈ 312 కంపెనీల షేర్ల నుంచి మదుపరులు బయటపడేంందుకు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ ఈ నెల 12 నుంచి ‘పీరియాడిక్‌ కాల్‌ ఆక్షన్‌’ పేరు తో ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నాయి.   


కంపెనీలివే: బీఎ్‌సఈలో లిస్టయిన పెద్ద గా ట్రేడింగ్‌ లేని కంపెనీల జాబితాలో గర్వారే మెరైన్‌ ఇండస్ట్రీస్‌,  మెఫ్‌కామ్‌ క్యాపిటల్‌ మా ర్కెట్స్‌ లిమిటెడ్‌, ఎకామ్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, మారుతి సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, బెంగళూరు ఫోర్ట్‌ ఫార్మ్స్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ ఇన్వెస్టా లిమిటెడ్‌ తదితర కంపెనీలున్నాయి. 


కాగా బీకేఎం ఇండస్ట్రీస్‌, జీటీఎన్‌ టెక్స్‌టైల్స్‌, గుజరాత్‌ ఫౌండ్రీ, గుజరాత్‌ లీజ్‌ ఫైనాన్సింగ్‌, హోటల్‌ రగ్బీ, కౌసల్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి కంపెనీలు.. ఎన్‌ఎ్‌సఈ జాబితాలో ఉన్నాయి. 

Updated Date - 2021-04-10T06:41:40+05:30 IST