కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-18T05:43:06+05:30 IST

కరోనా వైర్‌సపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యురాలు ఏ నాగరాజ్యలక్ష్మీ అన్నారు. మండల కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కరోనా వైర్‌సపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒమైక్రాన్‌ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ మా్‌స్కలు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడి ఉండవద్దని సూచనలు చేస్తూ మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహించారు.

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి
మైక్‌ ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్న కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం

- డాక్టర్‌ ఏ నాగరాజ్యలక్ష్మీ

కనిగిరి, జనవరి 17: కరోనా వైర్‌సపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యురాలు ఏ నాగరాజ్యలక్ష్మీ అన్నారు. మండల కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కరోనా వైర్‌సపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒమైక్రాన్‌ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ మా్‌స్కలు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడి ఉండవద్దని సూచనలు చేస్తూ మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, తహసీల్దార్‌ పుల్లారావు, గుడ్‌హెల్ప్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరో ఏడుగురికి కరోనా

కందుకూరు  : కందుకూరు నియోజక వర్గంలో మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. కందుకూరు మండలంలో నలుగురికి, లింగసముద్రం మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం కందుకూరు నియోజకవర్గంలో 19  మందికి కరోనా సోకగా సోమవారం మరో ఏడుగురికి కరోనా సోకినట్లు వెల్లడికావడంతో    కొవిడ్‌  థర్డ్‌  వేవ్‌ శరవేగంగా విజృంభిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

మున్సిపల్‌ కమిషనర్‌కు కరోనా

కందుకూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌ కరోనా బారిన పడ్డారు. సోమవారం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో 15 రోజులు హోం ఐసోలేషనల్‌లో ఉండనున్నట్లు తెలిపారు. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌కు  కొవిడ్‌ రావడంతో కార్యాలయం అధికారులు, సిబ్బందితోపాటు పలువురు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-01-18T05:43:06+05:30 IST