వానలో తడిచారా చుండ్రుతో కాస్త జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-07-26T17:35:28+05:30 IST

రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా చుండ్రును పెరగకుండా నియంత్రించవచ్చు. వర్షంలో తడిచిన ప్రతిసారి తలస్నానం తప్పక చేయాలి. ఇది చుండ్రును అరికట్టడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

వానలో తడిచారా చుండ్రుతో కాస్త జాగ్రత్త..!

వర్షాకాలం వచ్చిందంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా తల తడుస్తూనే ఉంటుంది. ఆ తడి తలను తుడిచేసుకుని ఊరుకుంటారు. నెమ్మదిగా చుండ్రు సమస్య పెరిగి పెద్దదై చికాకు పెట్టేదాకా అసలు ఆ ఊసే పట్టదు కొందరికి. చిన్న చిన్న నిర్లష్యాలు తలను, వెంట్రుకలను ఇబ్బంది పెట్టేలా చేస్తాయి. అసలు ఈ చుండ్రు మనలో సాధారణమైన సమస్యగా మారిపోయింది. మామూలుగా ఎంత ఆరోగ్యంగా ఉన్న జుట్టున్నా తలలో చుండ్రు పెరుగుతుంది. సరైన పోషణ చేయకపోతే మగవారిలో బట్టతల వచ్చేందుకు కూడా కారణం అవుతుంది. ఆడవారిలో వెంట్రుకలు పూర్తిగా రాలి జుట్టు పలుచగా తయారవుతుంది. జీవం కోల్పోయి కనిపిస్తుంది. 


చుండ్రు తెల్లగా పలుచని పొరలాగా తలలో పేరుకుంటుంది. నల్లని దుస్తులు వేసుకున్నప్పుడు పొట్టులా రాలి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది తలలో మొదలైనప్పుడు దురద పెడుతూ, జుట్టు మెరిసే గుణాన్ని కోల్పోయేలా చేసి, వెంట్రుకలు రాలిపోతాయి. ఈ సమస్య ఇప్పటి టీనేజర్స్ లో చాలా వరకూ ఎదుర్కుంటున్న సర్వ సాధారణమైన సమస్యగా మారిపోయింది. చుండ్రు అనేది ప్రపంచ జనాభాలో 50 శాంతం జనాభా ఎదుర్కుంటున్న చర్మ సమస్యగా నిపుణులు చెపుతున్నారు. ఈ సూక్ష్మ క్రిమి మామూలుగా అందరి తలలోనూ ఉంటుంది కానీ కాస్త సమస్య పెద్దదైతే మాత్రం పిరిస్థితి చిరాకుగా మారుతుంది. 


ఈ వర్షాకాలంలో తడిచిన తలలో చాలా త్వరగా ఈ క్రిమి వ్యాపిస్తుంది. మీ జుట్టుకు ప్రయోజనకరంగా ఉండేలా కీటోకానజోల్, సాలిసిలిక్ యాసిడ్, సెలీనియం డైసల్ఫైడ్ వంటి యాంటీ ఫంగల్‌లను కలిగి ఉన్న యాంటీ-డాండ్రఫ్ షాంపూలను ఉపయోగించడం మంచిది. చుండ్రు చికిత్స కోసం ఎటువంటి ఇంటివైద్యం కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. తరుచుగా నిమ్మకాయ పెరుగు కలిపి జుట్టుకు పట్టిస్తూ ఉంటారు ఇలా చేయడం కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీ జుట్టుకు ఏది సరిపడుతుందో తెలియకపోతే సరైన సలహా కోసం చర్మ వైద్యులను సలహా తీసుకోవడం మంచిది. 


కనీసం వారానికి ఒకసారి తలకు హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల స్కాల్ఫ్ లో రక్తప్రసరణ బావుంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. హైయిర్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే జెల్, పోమాడ్ వంటి స్టైలింగ్ ఉత్పత్తులను వాడటం వల్ల తలపై చికాకు మొదలవుతుంది. ఇదే ఆల్కహాల్ లేని స్టైలింగ్ ఉత్పత్తులైతే మీ తలమీద చర్మం పొడిగా ఉంటుంది. చుండ్రును మరీ వ్యాపించకుండా చేస్తాయి. 


రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా చుండ్రును పెరగకుండా నియంత్రించవచ్చు. వర్షంలో తడిచిన ప్రతిసారి తలస్నానం తప్పక చేయాలి. ఇది చుండ్రును అరికట్టడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మనం అందరం చేస్తున్న అటువాటైన పని ఏంటంటే చుట్టును డ్రైయర్స్ తో ఆరబెట్టడం, లేదా తడి జుట్టును జడలా అల్లడం వల్ల చుండ్రు త్వరగా వ్యాపిస్తుంది. తడి తలను చక్కని పొడి టవల్ తో తుడిచి గాలికి ఆరబెడ్డటం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గాలిలో ఆరిన తల భాగం సహజంగా పొడిగా మారుతుంది. మార్కెట్ లో దొరుకుతున్న ఉత్పత్తులను తెచ్చి వాడేయడం కూడా జుట్టుకు దెబ్బే.. ఇవి మేలు చేయడం అటుంచి జుట్టుకు కీడునే ఎక్కువ చేస్తాయి. కాబట్టి చుండ్రు సమస్యకు సొంత వైద్యం కన్నా చర్మ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. మన వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచి చుండ్రుకు చెక్ పెట్టే ఉత్పత్తులను వాడితే సరి.

Updated Date - 2022-07-26T17:35:28+05:30 IST