జర భద్రం!

ABN , First Publish Date - 2020-11-24T05:40:54+05:30 IST

ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10ు తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది

జర భద్రం!

ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10శాతం తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి చలికాలం కరోనాతో పాటు ఇతరత్రా సీజనల్‌ ఇన్‌ఫెక్షన్ల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. 


  1. ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్‌ కట్టుకోవాలి.
  2. సాధారణ జలుబునూ నిర్లక్ష్యం చేయకూడదు 
  3. ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను కలవటం తప్పనిసరి. 
  4. నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది. 
  5. డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది
  6. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసీ గదులకు దూరంగా ఉండాలి. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిది.
  7. అగర్‌బత్తీలు, ఇతర పొగల వల్ల ఊపిరితిత్తులు అలసటకు లోనవుతాయి. కాబట్టి పొగలకు దూరంగా ఉండాలి.
  8. కాలుష్యం కలగలసిన పొగమంచు...‘స్మాగ్‌’ ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది. స్మాగ్‌ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది.

Updated Date - 2020-11-24T05:40:54+05:30 IST