వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్ రాజ్
- కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్, జూలై 1: వర్షాకాలం ప్రారంభైన నేప థ్యంలో సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్ట రేట్లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకుండా ఉండేలా చూడాలన్నారు.