సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-08-15T05:40:58+05:30 IST

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తన నివాసంలో మొక్కల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగిస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 14 : మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల పాటు తన నివాసంలోని మొక్కల కుండీల్లో నిలువ ఉన్న నీరును తొలగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాల పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి ప్రైడే డ్రైడే నిర్వహిస్తూ పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి సబిత చెప్పారు. వర్షాలతో పొంచి ఉన్న వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉండటం కారణంగానే దోమలు పెరిగి వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. పాత టైర్లు, కుండీల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

Updated Date - 2022-08-15T05:40:58+05:30 IST