సంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-07-07T06:53:58+05:30 IST

పశువులు, జీవాలు, పెంపుడు జంతువులు సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా రైతులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు.

సంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

జగిత్యాల అర్బన్‌, జూలై 6: పశువులు, జీవాలు, పెంపుడు జంతువులు సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా రైతులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలలో ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత యాంటీ రేబీస్‌ టీకాల శిబిరాన్ని జిల్లా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ రవి హాజరై టీకా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెంపుడు జంతువులకు విధిగా టీకాలు వేయించాలని సూచిం చారు. వీధి కుక్కలు, కోతుల బెడదను నివారించడానికి కుటుంబ నియంత్రణ, వాక్సినేషన్‌ చేసి వదిలిపెట్టడం కోసం మున్సిపల్‌ పరిధిలో రూ25లక్షలతో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అంతకు ముందు  పశువైద్య సహాయ సంచాలకులు మదన్‌మోహన్‌ మాట్లాడుతూ పశువులు. జీవాలు, పెంపుడు జంతువులకు ఆంత్రాక్స్‌, బ్రుసెల్లోసిస్‌ ఆవులు, గేదెలు, కుక్కల ద్వారా లెప్తోస్పైరోసిన్‌ వ్యాధులు ఇతర జంతువుల నుంచి మనుషులకు సంక్ర మించే ప్రమాదం ఉందన్నారు. ఈ శిబిరంలో భాగంగా 195 ఆంటీ రేబీస్‌ టీకా లను పెంపుడు కుక్కలకు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌ఎల్‌ మనోహర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.నరేష్‌, ఏరియా వెటర్నిటీ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌ రావు, డాక్టర్‌ బద్దం రాజేంధర్‌రెడ్డి, డాక్టర్‌ వేణుగోపాల్‌, సహా యక సిబ్బంది రవీందర్‌, రాజశ్రీ, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:53:58+05:30 IST