బీడీఎల్ గేటు ఎదుట నిరసన తెలుపుతున్న బీడీఏయూ నాయకులు
చంపాపేట, మార్చి3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు కేంద్రం విక్రయించేందుకు ప్రయత్నించడం తగదని బీడీఎల్ బీడీఈయూ అధ్యక్షుడు ఎ.బాపురావు అన్నారు. హైదరాబాద్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కంచన్‌బాగ్‌లోని బీడీఎల్ ఔటర్ గేట్ ఎదుట ఉద్యోగులు బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీడీఈయూ ప్రధాన కార్యదర్శి జీఆర్.విజయ్‌కుమార్, కోశాధికారి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి, జీఎస్ పి.శ్రీలక్ష్మి, నాయకులు జేడీ మల్లేష్, కె.సుధీర్‌రెడ్డి, రాజు, క్రిష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.