Abn logo
Sep 27 2021 @ 00:11AM

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించాలి

మాట్లాడుతున్న వెంగళరావు

 బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు 

గుజరాతీపేట: బీసీలకు తక్షణమే చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆయన విలేక రులతో మాట్లాడారు. దేశజనా భాలో 56శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పించకుడా కేవలం వారిని ఓటు యంత్రాలుగా రాజకీయపార్టీలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మం డల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంలో ప్రధాని మోదీ జాప్యం చేస్తున్నారని  ఆరోపించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య చేస్తున్న పోరాటాలను  కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కానీ, అగ్రవర్ణాల వారికి ఈబీసీ పేరుతో 10శాతం రిజరేషన్‌ కల్పిస్తూ బిల్లును పది రోజుల్లో ఆమోదించారని విమ ర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. 50శాతం బీసీలకు నామినే టెడ్‌ పోస్టులు ఇస్తామన్న హామీ కూడా నెర వేర్చలేకపోయారన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా బీసీలకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదన్నారు.  ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టా చంద్రపతిరావు, ప్రధాన కార్యదర్శి బాడాన దేవభూషణరావు, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.