చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-10T10:12:29+05:30 IST

చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

లేకుంటే తిరుగుబాటు తప్పదు: ఆర్‌. కృష్ణయ్య 

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని కోరింది. ఈ విషయమై  రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య, బీసీ సంఘం కన్వీనర్‌ గుజ్జ కృష్ణ నాయకత్వంలో మంగళవారం ఆ సంఘం ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌ రావు, చింతా అనురాధ, మార్గాని భరత్‌, మాజీ ఎంపీ వి. హనుమంతరావులు ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తామని చెప్పారు. 

Updated Date - 2022-08-10T10:12:29+05:30 IST