ఇది ఊహించని పరిణామం: అరుణ్‌

ABN , First Publish Date - 2021-05-06T09:37:16+05:30 IST

ఐపీఎల్‌-14 వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తెలిపాడు. ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే విదేశాల్లోనే ఐపీఎల్‌ నిర్వహించేవారమని అన్నాడు.

ఇది ఊహించని పరిణామం: అరుణ్‌

ఐపీఎల్‌-14 వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తెలిపాడు. ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే విదేశాల్లోనే ఐపీఎల్‌ నిర్వహించేవారమని అన్నాడు. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా ఎలా సోకిందో తెలుసుకునే పనిలో బోర్డు ఉందని అన్నారు. ‘కొవిడ్‌ పరిస్థితిపై నిరంతరం సమీక్ష చేస్తున్నాం.


సోమవారం ఒకరిద్దరు ఆటగాళ్లకు కరోనా సోకగానే అప్రమత్తమయ్యాం. ఒక రోజు వ్యవధిలో మరికొంత మంది పాజిటివ్‌గా తేలడంతో టోర్నీ వాయిదా వేయడం మినహా మాకు మరో మార్గం లేకపోయింది. ఇంగ్లండ్‌తో సిరీ్‌సను అహ్మదాబాద్‌, చెన్నై, పుణెలో విజయవంతంగా నిర్వహించాం. దాంతో ఐపీఎల్‌ను కూడా ప్రధాన నగరాల్లో జరపాలని అనుకున్నాం. కానీ, ఇలాంటి పరిస్థితి తలెత్తుందని ఎవరూ ఊహించలేదు. తర్వాత ఐపీఎల్‌ రీషెడ్యూల్‌ గురించి ఆలోచిస్తాం’ అని ధూమల్‌ తెలిపాడు.’

Updated Date - 2021-05-06T09:37:16+05:30 IST