ముంబై: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇకపై స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. ప్రస్తుతం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 ఎడిషన్ను పూర్తిగా యూఏఈలో నిర్వహించారు. గతేడాది భారత్లోనే ఐపీఎల్ నిర్వహించినప్పటికీ కరోనా రెండోదశ నేపథ్యంలో 25 మ్యాచ్ల తర్వాత అక్టోబర్-నవంబరులో రెండో దశ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించారు.
ఈసారి మాత్రం కరోనా కేసులు దాదాపు తగ్గుముఖం పట్టడంతో ఇండియాలోనే నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే, కరోనా కారణంగా 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 2వ తేదీ నుంచి కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ ఐదో తేదీ నుంచి జరగనున్న అన్ని మ్యాచ్లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ‘బుక్ మై షో’లోనూ వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి