ఓపెనర్‌గా తొలిసారి సచిన్.. నాటి ఫొటోను షేర్ చేసిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-03-27T22:04:09+05:30 IST

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతి చిన్న వయసులోనే

ఓపెనర్‌గా తొలిసారి సచిన్.. నాటి ఫొటోను షేర్ చేసిన బీసీసీఐ

ముంబై: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతి చిన్న వయసులోనే మైదానంలో అడుగుపెట్టి రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్న టెండూల్కర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. 1994లో ఇదే రోజున సచిన్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ బీసీసీఐ నాడు బ్యాటింగ్ చేస్తున్న సచిన్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి చితక్కొట్టాడు. 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ 142 పరుగులకే ఆలౌట్ అయింది. సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజాతో కలిసి తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 49 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 167.34 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. కాగా, కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు సచిన్ కూడా అండగా నిలిచాడు. తనవంతు సాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు.  

Updated Date - 2020-03-27T22:04:09+05:30 IST