జూన్ నెలాఖరులో ప్రాక్టీస్ ప్రారంభించనున్న భారత క్రికెటర్లు?

ABN , First Publish Date - 2020-06-02T21:51:22+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో జూన్ నెలాఖరులో స్టేడియంలలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆటను తిరిగి

జూన్ నెలాఖరులో ప్రాక్టీస్ ప్రారంభించనున్న భారత క్రికెటర్లు?

లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో జూన్ నెలాఖరులో స్టేడియంలలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆటను తిరిగి ప్రారంభించేందుకు అన్ని రకాలుగా బోర్డు కృషి చేస్తోందని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) పరిశీలిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. ఒక్కసారి 100 శాతం నమ్మకం వచ్చిన తర్వాత పలు వేదికలను పరిశీలించి ఒక వేదికను ఎంపిక చేస్తాము. ఎన్‌సీఏ ప్రాధాన్యత ఇస్తున్నాము. మిగితా వేదికలు పరిశీలిస్తున్నాము. బహుశా, ప్రయాణ నిబంధనలు సడలించిన తర్వాత జూన్ నెలాఖరు వరకూ క్యాంపు జరిగే అవకాశం ఉంది’’ అని అరుణ్ పేర్కొన్నారు. 


కరోనా వ్యాప్తి కారణంగా గత రెండు నెలలుగా ఆటగాళ్లు అంతా క్రికెట్‌కి దూరం అయ్యారు. అయితే క్రికెటర్లు అందరూ ఎప్పుడు ట్రైనింగ్ ప్రారంభించుదామా.. అని ఎదురుచూస్తున్నారని అరుణ్ అన్నారు. ‘‘అందరూ ప్రాక్టీస్ కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశం ఉన్నవాళ్లు బయట రన్నింగ్, ఇతర ప్రాక్టీస్ చేశారు. కానీ, ఫ్లాట్, అపార్ట్‌మెంట్‌లలో ఉండేవాళ్లకు ఆ అవకాశం లేదు. అందుకే అందరూ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-06-02T21:51:22+05:30 IST