ఐపీఎల్ 2020పై ఇంకా అందలేదట..!

ABN , First Publish Date - 2020-08-07T20:11:47+05:30 IST

2020లో ఐపీఎల్ జరుగుతుందో, లేదోనన్న సందిగ్ధత నడుమ ఐపీఎల్ నిర్వహణకు...

ఐపీఎల్ 2020పై ఇంకా అందలేదట..!

న్యూఢిల్లీ: 2020లో ఐపీఎల్ జరుగుతుందో, లేదోనన్న సందిగ్ధత నడుమ ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. అయితే.. యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న బీసీసీఐ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతి కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చినప్పటికీ ఇంకా అధికారిక అనుమతి పత్రాన్ని బీసీసీఐకి పంపకపోవడం గమనార్హం. దీంతో.. కేంద్రం మళ్లీ ఏం ఆలోచన చేస్తుందోనన్న టెన్షన్ బీసీసీఐలో నెలకొంది. ఇప్పటికే చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివోతో చేసుకున్న ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని 2020 సీజన్‌కు గానూ బీసీసీఐ రద్దు చేసుకుంది.


కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం త్వరలో టెండర్లు పిలవాలని బీసీసీఐ భావిస్తున్న ఈ తరుణంలో కేంద్రం వేచిచూస్తున్న థోరణి బీసీసీఐలో టెన్షన్ పెంచుతోంది. కొద్దిరోజుల్లో అధికారిక అనుమతి పత్రం అందుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 2020 మొదలుకానుంది.



Updated Date - 2020-08-07T20:11:47+05:30 IST