బీసీసీఐకి ఊరట

ABN , First Publish Date - 2021-06-17T09:27:15+05:30 IST

ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు డెక్కన్‌చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4.800 కోట్లు చెల్లించాలన్న ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన ఆదేశాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది.

బీసీసీఐకి ఊరట

చార్జర్స్‌కు రూ. 4,800 కోట్ల 

చెల్లింపు ఆదేశాలు రద్దు


ముంబై: ఒకప్పటి ఐపీఎల్‌ జట్టు డెక్కన్‌చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4.800 కోట్లు చెల్లించాలన్న ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన ఆదేశాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఐపీఎల్‌ నుంచి తమను తొలగించడంపై చార్జర్స్‌  2012లో బాంబే హైకోర్టులో సవాలు చేసింది. దాంతో వివాద పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌ను హైకోర్టు నియమించింది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు చార్జర్స్‌కు బీసీసీఐ రూ. 4,800 కోట్లు చెల్లించాలని గత జూలైలో ఆర్బిట్రేటర్‌ ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాన్ని బాంబే కోర్టు బుధవారం నిలిపేసింది. అయితే చార్జర్స్‌కు బకాయిపడ్డ రూ. 30కోట్లను వడ్డీతో చెల్లించాలని బీసీసీఐకి సూచించింది.

Updated Date - 2021-06-17T09:27:15+05:30 IST