వివో సస్పెన్షన్‌పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-08-09T23:29:51+05:30 IST

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకున్నంత మాత్రాన నష్టమేమీ లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. వివో వెళ్లిపోయినంత మాత్రాన..

వివో సస్పెన్షన్‌పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి  వివో తప్పుకున్నంత మాత్రాన నష్టమేమీ లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. వివో వెళ్లిపోయినంత మాత్రాన ఐపీఎల్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తదని, ఓ చిన్న సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ వెబినార్‌లో పాల్గొన్న గంగూలీ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. అందులో వివో సస్పెన్షన్‌పై కూడా మాట్లాడారు. ప్రస్థుత పరిస్థితులపై బోర్డు దృష్టి సారించిందని, సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ‘చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకోవడం వల్ల ఐపీఎల్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఏమాత్రం ఎదుర్కోదు. ఇదో చిన్న సమస్య. సరైన ప్రణాళికతో దీన్ని అధికమించగలమనే నమ్మకం ఉంది. ఏదైనా పెద్ద మార్పు సంభవిస్తున్నప్పుడు ఒక్కసారిగా జరగదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాం. త్వరలో సమస్య నుంచి బయటపడతామ’ని గంగూలీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో 5 ఏళ్ళకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా, బాయ్‌కాట్ చైనా వంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ వివోను స్పాన్సర్ షిప్ నుంచి సస్పెండ్ చేసింది.

Updated Date - 2020-08-09T23:29:51+05:30 IST