జూన్ 5న బిసి విద్యాసంస్థల్లో డిగ్రీ, ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-05-25T23:15:23+05:30 IST

డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(bc welfare residential institute) కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్ 5న బిసి విద్యాసంస్థల్లో డిగ్రీ, ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(bc welfare residential institute) కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా  బిసి గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం 51905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఇంటర్ కోర్సుల కోసం 45735 మంది దరఖాస్తు చేసుకోగా, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 


వీరందరికీ వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని మల్లయ్య బట్టు తెలిపారు.బిసీ సంక్షేమ గురుకుల్లో  6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూన్ 2 వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలని మల్లయ్య బట్టు కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి 19 జూన్ న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ చూడాలని, 040-23322377, 23328266 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. 

Updated Date - 2022-05-25T23:15:23+05:30 IST