ఈనెల 28న సివిల్స్ విజేతలతో ముఖాముఖి

ABN , First Publish Date - 2021-10-18T22:09:47+05:30 IST

దేశంలోనే అత్యున్నత సర్వీసుల ఎంపిక కోసం యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ రాయాలని, రాసి విజయం సాధించాలని నేటి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ,

ఈనెల 28న సివిల్స్ విజేతలతో ముఖాముఖి

హైదరాబాద్: దేశంలోనే అత్యున్నత సర్వీసుల ఎంపిక కోసం యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వహించే సివిల్స్ రాయాలని, రాసి విజయం సాధించాలని నేటి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, పట్టుదలతో శ్రమిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు సివిల్స్ పై యువతలో అవగాహన పెరిగింది. లక్షలాది మంది ఈ పరీక్ష రాస్తున్నా  విజయం మాత్రం కొంత మందే సాధిస్తున్నారు. ఆ కొద్దిమందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉండడం సంతోషించదగ్గ విషయం. ఈ ఏడాది సివిల్స్ లో ఎక్కువ మంది ర్యాంకులు సాధించి అత్యున్నత సర్వీస్ కు ఎంపికయ్యారు. 


కొత్తగా సివిల్స్ రాయాలనుకునే వారి కోసం ఇప్పటికే ర్యాంకు సాధించిన విజేతలతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నది తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్  సివిల్స్ సాధించిన విజేతలతో  ముఖాముఖి కార్యక్రమం బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 న రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశంలో సివిల్స్ పై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పాల్గొనవచ్చు.  సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లకి కావలసిన సూచనలు ఇస్తారు.


సలహాలు ఇవ్వడమే కాకుండా వాళ్లు విజయం సాధించడానికి ఏ విధమైన ప్రిపరేషన్ అవసరమవుతుంది, ఏ సబ్జెక్ట్ ను ఆప్షనల్ గా తీసుకోవాలి వంటి అనేక సందేహాలకు ఈ సమావేశంలో సమాధానాలు సూచిస్తారు. సివిల్స్ రాయాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాల చారి ఒక ప్రకటనలో కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తిగల వారు +91 9063131999  నెంబర్ కి వాట్సాప్ లో తమ పేరు, క్వాలిఫికేషన్ వివరాలు పంపించాలి. ఈనెల 25వ తేదీలోగా వివరాలు పంపించిన వారికి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-18T22:09:47+05:30 IST