విద్యార్థులకు సదుపాయాల కల్పనలో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-12-11T01:09:12+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం సూచించారు.

విద్యార్థులకు సదుపాయాల కల్పనలో అలసత్వం వద్దు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో  నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ల  సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని, పోషకాహారలోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. 


రీజనల్ కోఆర్డినేటర్ ప్రతినెలలో తప్పని సరిగా నాలుగు రోజులు పాఠశాలలో నైట్ హాల్ట్ చేయాలన్నారు. స్కూల్స్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాతన దృష్టికి తీసుకురావాలని విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలన్నారు. విద్యాబోధనలోనూ, ఆహారం అందించడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వం జరగకూడదని ఆయన హెచ్చరించారు. ప్రతి రీజనల్ కోఆర్డినేటర్ తప్పనిసరిగా తన పరిధిలోని స్కూళ్లను తరచుగా సందర్శించాలని ఆయన సూచించారు.విద్యార్థుల బంగారు భవిష్యత్ కు గురుకులాలు బాటలు వేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల సొసైటీ డిప్యూటీ సెక్రటరీలు ఇందిర , మంజుల, తిరుపతి, తెలంగాణలోని పది జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-11T01:09:12+05:30 IST