బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ విజేతలతో ముఖాముఖి

ABN , First Publish Date - 2021-10-27T21:33:36+05:30 IST

సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం, సివిల్స్ రాయాలనుకుంటున్న యువత కోసం బిసి స్టడీ సర్కిల్ సదావకాశాన్ని కల్పిస్తోంది.

బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ విజేతలతో ముఖాముఖి

హైదరాబాద్: సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం, సివిల్స్ రాయాలనుకుంటున్న యువత కోసం బిసి స్టడీ సర్కిల్ సదావకాశాన్ని కల్పిస్తోంది. ఈనెల 28న రవీంద్రభారతిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 2020 సివిల్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో సివిల్స్ పై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పాల్గొనవచ్చు. సివిల్స్ కు ఎలా ప్రిపేర్ కావాలి, ఆప్షనల్ గా ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకోవాలి, విజయం సాధించడానికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అవుతుంది వంటి అనేక అంశాలు విజేతల ద్వారా తెలుసుకోవచ్చు.  


సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లకి కావలసిన సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా వాళ్లు విజయం సాధించడానికి కావల్సిన అనేక విషయాలు చర్చిస్తారు. సివిల్ సర్వీస్ సాధించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాల చారి ఒక ప్రకటనలో కోరారు. 2020  సివిల్స్ లో విజేతలుగా నిలిచిన తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని యువతకు మార్గదర్శనం చేస్తారని ఆయన తెలిపారు. ఈ సదావకాశాన్ని యువత వినియోగించుకుని ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-10-27T21:33:36+05:30 IST