నిరుద్యోగులకు ‘శిక్ష’ణ..!

ABN , First Publish Date - 2021-12-03T05:25:46+05:30 IST

కరువు జిల్లాలో ఉద్యోగాలు సాధించేందుకు యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఏ ర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్‌ నేడు నిర్వీర్యమవుతూ దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది.

నిరుద్యోగులకు ‘శిక్ష’ణ..!

నిర్వీర్యమవుతున్న బీసీ స్టడీ సర్కిల్‌

మూడే ళ్లుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వని వైనం

పదకొండేళ్లుగా ఇనచార్జి డైరక్టరే గతి

అభ్యర్థులకు అందని స్టైఫండ్‌

ఆందోళనలో నిరుద్యోగ యువత

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 2: కరువు జిల్లాలో ఉద్యోగాలు సాధించేందుకు యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఏ ర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్‌ నేడు నిర్వీర్యమవుతూ దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. మూడేళ్ళుగా పోటీ పరీక్షలకు ఇచ్చే శిక్షణలు పూర్తి గా నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో ఒక్క పైసా కూడా బీసీ స్ట డీ సర్కిల్‌ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం గమనా ర్హం. దీనిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1994లో జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కి ల్‌ ఏర్పాటు చేశారు. ఇది నిరుద్యోగులకు ఎంత ఉపయోగపడుతోం దో లేదో తెలియదు కానీ ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం జేబులు నింపుకోవడానికి దోహదపడుతోందని చెప్పవచ్చు. ఆరున్నరేళ్ళుగా రెగ్యులర్‌ డైరక్టర్‌ లేరు. దీంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. 2010 నుంచి సుమారు పదకొండేళ్ళుగా ఇక్కడ ఇనచార్జి పాలనే సాగుతోంది. ఇందులో అకౌంట్‌ ఆఫీసరే కీలకం. ఇక్కడ జరిగే లావాదేవీలు, ఖర్చులన్నీ ఏఓనే చూసుకుంటారు. ఇం దులో ఇద్దరు అటెండర్లు, ఒక నైట్‌వాచమెన, కంప్యూటర్‌ ఆపరేటర్‌, లైబ్రేరియన, కోర్సు కో-ఆర్డినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. అటెండర్‌, వాచమెనలు మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. మిగిలిన సిబ్బంది మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నా రు. గతేడాదిన్నగా జిల్లాలో ఉన్న బీసీ స్టడీసర్కిల్‌ మూసివేత దిశగా అడుగులు వేస్తోంది.  కరువు జిల్లాలో నిరుద్యోగులకు ఉన్న ఒక్కగానొక్క కోచింగ్‌ సెంటర్‌ను కూడా మూసివేస్తే ఇక ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు వేలాది రూపాయలు వెచ్చించి పోటీపరీక్షలకు సిద్ధమవడం తప్పా ప్రత్యామ్నాయ మార్గమే లేదు. రాష్ట్రంలో ఉన్న 13 బీసీ స్టడీ సర్కిళ్లలో కేవలం అనంతపురం, గుంటూరు, రాజమండ్రిలలో మాత్రమే ప్రభుత్వ సొంత భవనాలున్నాయి. అలాంటి సొంత భవ నం ఉన్న జిల్లాలోని బీసీ స్టడీసర్కిల్‌ను లేకుండా చేస్తారనే విషయా న్ని నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది జులైలో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ పోస్టుకు శిక్షణకు హాజరైన నిరుద్యోగ అభ్యర్థులకు నేటికీ స్టైఫండ్‌ అందలేదు. 175 మంది అభ్యర్థులకు గాను రూ.750 చొప్పున రూ.1.31 లక్షలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. దీనిపై ఎవరైనా నిరుద్యోగులు ప్రశ్నిస్తే బడ్జెట్‌ రాలేదు... వస్తే నే ఇస్తామని ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పుకువస్తున్నారు. 


ప్రధాన అధికారి పోస్టుకు మంగళం

ఇది వరకు బీసీ స్టడీసర్కిల్‌కు ప్రత్యేకంగా ప్రధానాధికారిగా డైరక్టర్‌ పోస్టు ఉండేది. గతేడాదిన్నరగా ఆ పోస్టు లేకుండా చేశారు. బీసీ సంక్షేమశాఖ డీడీ విధుల్లో భాగంగానే చేర్చారు. అధికంగా అదనపు ఖర్చు పేరుతో ప్రభుత్వం ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తోంది. ఏటా బీసీ స్టడీసర్కిల్‌కు రూ.15 లక్షలు బడ్జెట్‌ కేటాయించాల్సి ఉండగా..   రెం డున్నరేళ్లలో ఇంతవరకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాదిలో ఒక్క కోచింగ్‌ కూడా ఇవ్వలేదు. ఏడాదికి పైగా ఇక్కడ పోటీ పరీక్షలకు ఎటువంటి శిక్షణా తరగతులూ నిర్వహించకపోవడంతో శాశ్వతంగా బీసీ స్టడీసర్కిల్‌ను మూసివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ కింద ఉండడంతో ఇళ్లకు సాగనంపడానికి కూడా సిద్ధం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లతో లాలూచి పడి బీసీ స్టడీ సర్కిల్‌ను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. 


ప్రైవేటు పరం చేసే యత్నం 

కరువు జిల్లాలో పేద నిరుద్యోగులకు ఆసరగా ఉంటున్న బీసీ స్టడీసర్కిల్‌ను ప్రైవేటు పరం చేయడానికి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్ల క్రిందటే పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపారు. అయితే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అదే సమయంలో కరోనా వ్యాప్తితో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పలు ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుల నుంచి కొటేషన కూడా ప్రభుత్వం తీసుకుంది. అసలే కరువు జిల్లాలో ఏకైక శిక్షణా సంస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ముట్టజెప్పేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేయడం శోచనీయం.   


ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తార.. అయితే కరోనా ప్రభావంతో పూర్తిగా కోచింగ్‌లు నిలిపివేశారు. బీసీ స్టడీసర్కిల్‌ మూసివేస్తారనే అంశం తమ పరిధిలోది కాదు. అది ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్ణయం. నిధులు వస్తే కోచింగ్‌లు ప్రారంభించి, స్టైఫండ్‌ కూడా చెల్లిస్తాం. అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు ఇంతవరకు రాలేదు. ప్రైవేటు పరం చేయడంపై కూడా మాకు సమాచారం లేదు.  

యుగంధర్‌, బీసీ సంక్షేమశాఖ డీడీ, బీసీ స్టడీ సర్కిల్‌ ఇనచార్జి డైరక్టర్‌

Updated Date - 2021-12-03T05:25:46+05:30 IST