సివిల్స్ -2022 ఉచిత కోచింగ్ కు దరఖాస్తు తేదీ పొడిగింపు

ABN , First Publish Date - 2021-11-23T00:09:44+05:30 IST

సివిల్స్ -2022 రాయాలని ఆసక్తి ఉన్న బీసి యువతకు ఇస్తున్న ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టు బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

సివిల్స్ -2022 ఉచిత కోచింగ్ కు దరఖాస్తు తేదీ పొడిగింపు

హైదరాబాద్: సివిల్స్ -2022 రాయాలని ఆసక్తి ఉన్న బీసి యువతకు ఇస్తున్న ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టు బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. కోచింగ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 27 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్  040-24071178లో సంప్రదించాలని చెప్పారు.

Updated Date - 2021-11-23T00:09:44+05:30 IST