బిసి గురుకులాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు జూన్ 2 ఆఖరు తేదీ

ABN , First Publish Date - 2022-06-01T23:32:34+05:30 IST

తెలంగాణ బిసీ సంక్షేమ గురుకుల్లో(bc residential school) 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు

బిసి గురుకులాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు జూన్ 2 ఆఖరు తేదీ

హైదరాబాద్: తెలంగాణ బిసీ సంక్షేమ గురుకుల్లో(bc residential school) 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 2 వ తేదీతో ముగుస్తుందని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ  గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు(malliah bhattu)  ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 19 జూన్ న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. 


డిగ్రీ, ఇంటర్ కోర్సుల ప్రవేశపరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు ఈనెల 5న  నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు  http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి, హాల్ టికెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చని ఆయన  సూచించారు. 

Updated Date - 2022-06-01T23:32:34+05:30 IST