బిసి గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షకు 88శాతం హాజరు

ABN , First Publish Date - 2022-06-06T01:06:49+05:30 IST

బిసి గురుకుల కాలేజీల్లో (bc residential education) డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88శాతం విద్యార్థులు హాజరయ్యారని

బిసి గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షకు 88శాతం హాజరు

హైదరాబాద్: బిసి గురుకుల కాలేజీల్లో (bc residential education) డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88శాతం విద్యార్థులు హాజరయ్యారని మహాత్మా జ్యోతిబాఫూలే (mahatma jyotiba pule) తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకుల కాలేజీల్లో ఇంటర్ కోర్సుల కోసం 45735 మంది దరఖాస్తు చేసుకోగా 40575మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా 5144 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-06T01:06:49+05:30 IST