బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటాలు
ABN , First Publish Date - 2022-01-28T06:29:48+05:30 IST
బీసీల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సేన పోరాటాలు చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు.
బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటాలు
రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు
అజిత్‌సింగ్‌నగర్, జనవరి 27: బీసీల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సేన పోరాటాలు చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యాన రాజరాజేశ్వరిపేట పెనుయేలు చర్చిలో బీసీ నాయకులకు గురువారం ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనార్టీలకు రావలసిన నిధులు తీసుకురావడంతో తమ వంతు కృషి చేస్తామన్నారు. క్రిస్టియన్స్‌కు జాతీయ బీసీ సేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర నేతలు చింతా రశ్రీనివాస్, బెజవాడ తిరుపతిరావు, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు గేరా హానోక్, పాస్టర్లు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.