బీసీలకు 60 శాతం టిక్కెట్లు ఇవాలి..

ABN , First Publish Date - 2021-04-17T05:49:11+05:30 IST

బీసీలకు 60 శాతం టిక్కెట్లు ఇవాలి..

బీసీలకు 60 శాతం టిక్కెట్లు ఇవాలి..
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌

కాజీపేట టౌన్‌, ఏప్రిల్‌ 16 : ఎన్నికల్లో బీసీలకు 60 శాతం టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. కాజీపేట ఫాతిమానగర్‌లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీట్లు కేటాయించకుండా కేవలం ఓట్ల కోసమే అన్ని పార్టీలు బీసీలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. 60 శాతం ఉన్న బీసీలకు 30శాతం టిక్కెట్లు ఇచ్చి మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీసీలకు టిక్కెట్లు కేటాయించే పార్టీలకే మద్దతు ఉంటుందని ప్రకటించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టిక్కెట్లు కేటాయించని పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 66 డివిజన్లలో దాదాపు 40 టిక్కెట్లు బీసీలకు కేటాయించాలని కోరారు.  సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర అధ్యక్షుడు టి.విక్రం, నరేష్‌, ప్రజాపతి, జనగాం శ్రీనివా్‌సగౌడ్‌, సంపత్‌, మధు, రమేష్‌, లింగం, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:49:11+05:30 IST