బీసీ కార్పొరేషన్‌ ఈడీగా వెంకటసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-04-17T05:04:08+05:30 IST

జిల్లా వెనుకబడిన కులాల సేవా సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ హనుమంత్‌ వెంకటసుబ్బయ్య శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.

బీసీ కార్పొరేషన్‌ ఈడీగా వెంకటసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ
బాధ్యతలు స్వీకరిస్తున్న వెంకటసుబ్బయ్య

కడప(నాగరాజుపేట), ఏప్రిల్‌ 16: జిల్లా వెనుకబడిన కులాల సేవా సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ హనుమంత్‌ వెంకటసుబ్బయ్య శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న ఈడీ కరుణాకర్‌రెడ్డి మాతృసంస్థకు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ నియమ నిబంధనల మేరకు కలెక్టర్‌ సహాయ సహకారాలతో బీసీలలో అర్హులైన లబ్ధిదారులందరికీ సమన్యాయం చేస్తామని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి అదనపు బాధ్యతలు అప్పగించినందుకు కలెక్టర్‌ హరికిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-04-17T05:04:08+05:30 IST