Apr 11 2021 @ 12:03PM

బీబీ3 టైటిల్‌..డేట్‌, టైమ్‌ ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సినిమా షూటింగ్‌ కర్ణాటకలో జరుగుతుంది. బీబీ3 వర్కింగ్‌ టైటిల్‌తో ఇప్పటి వరకు అప్‌డేట్స్‌ ఇస్తూ వస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ సినిమా టైటిల్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ డేట్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సంవత్సరాది..ఉగాది రోజున మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మే 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పూర్ణ ఓ కీలక పాత్రను పోషిస్తుంది. సింహా, లెజెండ్‌ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.