బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి వర్షాలు

ABN , First Publish Date - 2021-09-11T21:48:58+05:30 IST

నేటి నుంచి 17 వ తేదీ వరకు (వారం రోజులు) ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి వర్షాలు

అమరావతి: నేటి నుంచి 17 వ తేదీ వరకు (వారం రోజులు) ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుందని చెప్పింది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశముండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుండపోతగా కురిశాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపచేశాయి.

Updated Date - 2021-09-11T21:48:58+05:30 IST