బే ఏరియాలో భీమ్లా నాయక్ ఫీవర్.. పవన్ ఫ్యాన్స్ సంబరాలు

ABN , First Publish Date - 2022-02-26T13:10:39+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాలు లీడ్ రోల్ లో తెరకెక్కిన "భీమ్లా నాయక్" శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది.

బే ఏరియాలో భీమ్లా నాయక్ ఫీవర్.. పవన్ ఫ్యాన్స్ సంబరాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాలు లీడ్ రోల్ లో తెరకెక్కిన "భీమ్లా నాయక్" శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, సినిమాపై పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానులూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా "భీమ్లా నాయక్" హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది.


ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాకూ "భీమ్లా నాయక్" ఫీవర్ పాకింది. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో బే ఏరియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ 27వ సినిమా అయిన భీమ్లా నాయక్‌కు గుర్తుగా బే ఏరియాలోని పవన్ అభిమానులు, జనసేన అభిమానులు... పవన్ ఫొటోకు 27 కొబ్బరికాయలు కొట్టి పండుగ చేసుకున్నారు. బే ఏరియాలోని పవన్ అభిమానులతో పాటు, టీడీపీ సానుభూతిపరులు, సినీ అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారు.


శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బే ఏరియాలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ అమెరికాలో భీమ్లా నాయక్ ఫీవర్ మరింత పెరగనుంది. గోడవర్తి మురళి, వీరబాబు ప్రత్తిపాటి, ప్రసాద్ మంగిన, శివ ప్రసాద్ పరుచూరి, శ్రీకాంత్ దొడ్డపనేని, సతీష్ బొల్లా, మధు గార్లపాటి, అజయ్, సాయి, సందీప్, ప్రకాష్  తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.





Updated Date - 2022-02-26T13:10:39+05:30 IST