ఫయాజ్‌ హత్య కేసులో.. బావమరిది కరీముల్లా అరెస్టు

ABN , First Publish Date - 2021-06-20T04:52:14+05:30 IST

తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో ఈనె ల 15న నమోదైన షేక్‌ ఫయాజ్‌బాష హత్య కేసుకు సంబంధించి అతని బావమరిది కరీముల్లాను ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారని త్రీటౌన్‌ సీఐ, ఇన్‌చార్జి రూరల్‌ సీఐ గంటా సుబ్బారావు తెలిపారు.

ఫయాజ్‌ హత్య కేసులో..  బావమరిది కరీముల్లా అరెస్టు
నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీఐ గంటా సుబ్బారావు

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 19 : తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో ఈనె ల 15న నమోదైన షేక్‌ ఫయాజ్‌బాష హత్య కేసుకు సంబంధించి అతని బావమరిది కరీముల్లాను ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారని  త్రీటౌన్‌ సీఐ, ఇన్‌చార్జి రూరల్‌ సీఐ గంటా సుబ్బారావు  తెలిపారు. శనివారం ఆయన పోలీస్‌ స్టేషన్లో విలేకర్లతో మాట్లాడుతూ అమృతానగర్‌కు చెందిన ఫయాజ్‌బాషను 15వ తేదీ రాత్రి అ ప్రాంతంలోనే నివాసముండే సొంత బావమరిది కరీముల్లా ఇనుపపైపుతో తలపై కొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం చిన్నశెట్టిపల్లె క్రాస్‌ వద్ద ఉండగా ఎస్‌ఐ రవికుమార్‌ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారన్నారు. విచారణలో తన అక్క షేక్‌ ముబారక్‌తో ఫయాజ్‌బాష ప్రతిరోజు మద్యం తాగివచ్చి గొడవపడుతూ ఉండేవాడని, 15న రాత్రి గొడవపడుతూ ఉంటే, తెలిసి, అక్కడివెళ్లి ముబారక్‌ను తమ ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. అదే రోజు ఆర్థరాత్రి తమ ఇంటి వద్దకు బావ ఫయాజ్‌బాష వచ్చి తన అక్కను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా అడ్డుకోబోయిన తనను చంపుతానని బెదిరించడంతో, అక్కడే ఉండిన ఇనుపపైపుతో తలపై కొట్టి చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. దీంతో అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ రవికుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:52:14+05:30 IST