Apr 12 2021 @ 18:50PM

‘బతుకు బస్టాండ్’ మూవీ ఫస్ట్ లుక్ వదిలారు

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బతుకు బస్టాండ్'. నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐఎన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. బతుకు బస్టాండ్ హీరో విరాన్ ముత్తంశెట్టి అల్లు అర్జున్‌కు స్వయానా బావమరిది. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.  ఈ ఫస్ట్‌ లుక్‌లో హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరూ రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.