Abn logo
Oct 15 2020 @ 00:31AM

బతుకమ్మ సిరులు సిరిసిల్లకేనా?

నాలుగు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరల పేరిట 1033 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్ర ఐటి చేనేత జౌళి శాఖ మంత్రి  కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్‌లో అధికమొత్తాన్ని కేటాయిస్తు న్నారనే విమర్శలు వస్తున్నాయి. నేతకార్మికులు అధికంగా ఉన్న నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో కూడా చేనేత పార్కులు ఏర్పాటు చేసి వారికి పని కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణకే వన్నె తెస్తుందని చెపుకుంటున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది. ఈ పార్క్ తమ ప్రతిపాదనలో లేదని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వమే పూనుకుని దీని ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగవంతం చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి. తమకు చేతి నిండా పని కల్పించి వలసలు, ఆత్మహత్యలు లేకుండా చూడాలని నేతన్నలు ఎన్నాళ్లుగానో విజ్ఞప్తి చేస్తున్నారు. వారి మొర ఆలకించాలి.


– సామంతుల సదానందం, పరకాల

Advertisement
Advertisement