చేనుకు కంచెగా బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2022-05-23T05:01:05+05:30 IST

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు వ్యవసాయ పొలాలకు కంచెలుగా ఉపయోగపడుతున్నాయి.

చేనుకు కంచెగా బతుకమ్మ చీరలు
కోనాయపల్లి శివారులో చేనుకు కట్టిన బతుకమ్మ చీరలు

తూప్రాన్‌రూరల్‌, మే 22: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు వ్యవసాయ పొలాలకు కంచెలుగా ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో  అడవిపందులు, కోతుల నుంచి పంటలను కాపాడుకోవడానికి బతుకమ్మ చీరలతో కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. తూప్రాన్‌ మండలంలోని కోనాయపల్లి, మల్కాపూర్‌, వెంకటాయపల్లి, దాతర్‌పల్లిలో కూరగాయలు, వరి పంటల రక్షణకు బతుకమ్మ చీరలను కట్టిన దృశ్యాలు అడుగడుగునా దర్శినమిస్తున్నాయి.


Updated Date - 2022-05-23T05:01:05+05:30 IST