Abn logo
Sep 27 2021 @ 01:00AM

పూల లోగిళ్లు

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

 - నేటి నుంచి బొడ్డెమ్మ సంబరాలు

- అక్టోబరు 6 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ 

- 14న పెద్ద బతుకమ్మ

- ఆడ పడుచులు పుట్టింటికి వచ్చే వేళ


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

తెలంగాణ పల్లె, పట్టణ వాకిళ్లు పూల లోగిళ్లుగా మారి పోయే వేళ.. తంగేడు పువ్వు ముచ్చట్లు.. గు నుగు పువ్వు సంబరాల మధ్య ఆడపడుచులు పుట్టిం టికి తరలివస్తున్న ఆనందోత్సవం.. ‘బతుకమ్మ బతు కమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... పాడిపంటలను ఉయ్యాలో... చల్లంగా చూడమ్మ ఉయ్యాలో’ అంటూ తొమ్మిది రోజులపాటు బతు కమ్మ పండుగ జరుపుకునే సంబరాల కంటే ముందు చిన్నారుల బొడ్డెమ్మ ఆటాపాటలు శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. అమవాస్య నుంచి చిన్న బతుకమ్మలతో సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. సోమవారం నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు బొడ్డెమ్మ సంబరాలు చిన్నా రులు జరుపుకుంటే 6వ తేదీ నుంచి చిన్న బతు కమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలు కానుంది. 14న పెద్ద బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. 15న విజయదశమి వేడుకలు జరగనున్నాయి. గత సంవత్సరం కరోనా కారణంగా ఆడాంబరాలు లేకు ండా సాదాసీదాగా జరుపుకున్న మహిళలు కరోనా తగ్గుముఖం పడుతుండడంతో సంబరాలు వైభవంగా నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

చిన్నారుల బొడ్డెమ్మ ప్రత్యేకం.. 

బతుకమ్మ సంబరాల కంటే ఏడు రోజుల ముందు చిన్నారులు ఆడుకునే బొడ్డెమ్మను ప్రత్యేకంగా చూస్తారు. చిన్నపిల్లలు, కన్నెపిల్లలు కలిసి ఒక పీటపైన ఎర్రమట్టితో అంతస్తులుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారు చేస్తారు. ప్రతీ రోజు సాయంత్రం అలంకరించి దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ  బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతారు. బొడ్డెమ్మ తరువాత వచ్చే అమవాస్య నుంచి మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభిస్తారు.  

ఆడపడుచులు ఎదురుచూసే సంబరం

తెలంగాణ జిల్లాల్లో ఆడ పడుచులందరూ బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరువైపులా పసుపు పారబోసినట్లుగా తంగేడు, ఏ దిక్కున చూసినా పలకరించే కట్ల పూలు, ప్రతీ ఇంటి గడప ముందు కనిపించే మందారాలు, తలుపు సందుల్లో తొంగి చూసే గన్నేరు.. నేలంతా పరుచుకునే గుమ్మడి ఇలా.. తీరొక్క రంగుల పూలతో ఆడ పడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  బతుకమ్మను మహిళలు తొమ్మిది రోజులపాటు  జరుపుకుంటే.. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లి పాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు.  చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి  ప్రధాన కూడలి వద్ద  బతుకమ్మ  ఆడుతారు. వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఆడ పడుచులు వాయినాలు ఇచ్చుకుంటారు.