ఒక్కేసి.. పువ్వేసి..

ABN , First Publish Date - 2022-09-25T06:49:28+05:30 IST

అంబర్‌పేట నియోజకవర్గంలో ఆదివారం నుంచి బతుకమ్మ వేడుకలు సందడి చేయనున్నాయి.

ఒక్కేసి.. పువ్వేసి..
రెడ్‌ కాన్వెంట్‌ పాఠశాలలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు, ఉపాధ్యాయరాళ్లు

 నేటినుంచి బతుకమ్మ సందడి 

బర్కత్‌పుర, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి) : అంబర్‌పేట నియోజకవర్గంలో ఆదివారం నుంచి బతుకమ్మ వేడుకలు సందడి చేయనున్నాయి. అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో  ఈ సంబురాలు నిర్వహించడానికి మహిళలు, యువతులు సన్నద్ధమవుతున్నారు. ప్రైవేటు కళాశాలలు కూడా వాటికోసం సన్నాహాలు చేస్తున్నాయి. 

  నేతల ఆధ్వర్యంలో సన్నాహాలు

అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో  అక్టోబర్‌ రెండో తేదీ సాయంత్రం 4గంటలకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సారధ్యంలో  ఈ వేడుకలు నిర్వహించనున్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ తన నియోజకవర్గంలో  ఈ సంబురాలు వైభవంగా నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దూసరి శ్రీనివాస్‌ గౌడ్‌  ఈ నెల 28న గోల్నాక డివిజన్‌లో బతుకమ్మ పోటీలను చేపట్టనున్నారు. బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి  ఈ నెల 26న గోల్కొండ కోటలోనూ, బీజేపీ సెంట్రల్‌ జిల్లా కోశాధికారి ఏ.సూర్యప్రకా్‌షసింగ్‌  అక్టోబర్‌ 1న బర్కత్‌పురలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాచిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ కన్నె ఉమాదేవి, నల్లకుంట డివిజన్‌ కార్పొరేటర్‌ వై.అమృత, బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌ బి.పద్మావెంకటరెడ్డి, గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య వివిధ బస్తీల్లో జరగనున్న  బతుకమ్మ వేడుకలల్లో పాల్గోనున్నారు.  అంబర్‌పేట నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీని నిర్వహిస్తున్నారు.  వేడుకలు ముగిసేవరకూ 25 కేంద్రాల ద్వారా వాటిని పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

ముషీరాబాద్‌ పాఠశాలలో  సంబరాలు 

 ముషీరాబాద్‌ :  ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల  ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి  సంబరాలను చేపట్టారు.ముషీరాబాద్‌ డిప్యూటీ ఐవోఎ్‌సలు స్వరూపరాణి, శ్రీనివా్‌సరాజు, ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌యాదవ్‌, పీఈటీ కిషోర్‌కుమార్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక

రాంనగర్‌ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని డిప్యూటీ డీఈవ చిరంజీవి అన్నారు. చిక్కడపల్లి సెయింట్‌ అడమ్స్‌ స్కూల్‌ ప్రాంగణంలో శనివారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.  విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సెయింట్‌ అడమ్స్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ న్యూ ఎరా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ బాల్‌రాజ్‌గౌడ్‌ తదిత రులు పాల్గొన్నారు. 

రాంనగర్‌ డివిజన్‌ బాకారంలోని రెడ్‌ కాన్వెంట్‌ పాఠశాల ఆధ్వర్యంలో  బతుకమ్మ వేడుకలు జరిగాయి.   పాఠశాల ప్రిన్సిపాల్‌ కమటం సౌజన్య వాటిని తిలకించారు. పాఠ శాల కరస్పాండెంట్‌ కమటం రఘు, ఉపాధ్యాయులు అరుణ, కవిత, నళిని, కృష్ణదత్త, పల్లవి తదితరులు పాల్గొన్నారు. 

బతుకమ్మ  ఆడిన విద్యార్థినులు

 రాంనగర్‌లోని కాకతీయ హైస్కూల్‌లోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హజరై విద్యార్థినీలతో బతుకమ్మ ఆడి సందడి చేశారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.  విద్యార్థినులు, ఉపాఽఽధ్యాయులు బతుకమ్మ, కోలాట మాడి సందడి చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ కోక నవీన్‌ ఆధ్వర్యంలో జరిగిన  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌.మోజేస్‌, దామోదర్‌రెడ్డి, మురళి, జ్ఞానేశ్వర్‌గౌడ్‌, శివ, సంపూర్ణ  పాల్గొన్నారు. 

నృత్యరూపకం

అంబర్‌పేట  : ప్రేమ్‌నగర్‌ హైమావతి పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు రావణకాష్టాన్ని నిర్వహించడమే కాకుండా మహిషాసూరమర్థిని అనే నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. 

Updated Date - 2022-09-25T06:49:28+05:30 IST