Batukamma సంబురం

ABN , First Publish Date - 2021-10-13T18:10:15+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఆనందకరమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో

Batukamma సంబురం

హైదరాబాద్/రవీంద్రభారతి: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఆనందకరమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ టీజీఓ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, పుల్లెంల రవీందర్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌, సహదేవ్‌, వెంకటయ్య, ఎంబి.కృష్ణయాదవ్‌, గండూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌, సుజాత, సబిత, స్వాతి, స్వరూప, సునీత, జోషీ, లీల, శీరిష, లావణ్య తదితరులు పాల్గొన్నారు. 

ఫ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు కళాకారులు, మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.


వ్యవసాయ వర్సిటీలో..

రాజేంద్రనగర్‌, అక్టోబర్‌ 12(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, రిజిష్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ బతుకమ్మ పూజలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు.


నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఆధ్వర్యంలో..

రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహ్మరావు పశువైద్య వర్సిటీ ఆవరణలో నాన్‌టీచింగ్‌ ఎంప్లాయీస్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షర్ఫుద్దీన్‌ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలో మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సుదర్శన్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ జి.అంజనేయులు, టి.నర్సింహ, ఎండీ జహంగీర్‌, సి.మధుసూదన్‌ పాల్గొన్నారు.


మంగళ్‌హాట్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ కో ఆపరేటివ్‌ ఆఫీసర్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధానకార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింట బతుకమ్మ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. ఈ వేడుకల్లో టీఎన్జీవో నల్గొండ అధ్యక్షుడు శ్రవణ్‌ కుమార్‌, జె.ప్రసన్న, అన్నపూర్ణ, యాదగిరి, విశాల్‌, రవీందర్‌, రాము, భరత్‌ పాల్గొన్నారు.

 టీఎన్జీవో యూనియన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ యూనిట్‌ అధ్యక్షుడు కేఆర్‌ రాజ్‌కుమార్‌, కార్యదర్శి ఎం.భాస్కర్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని డీఈఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో టీఎన్జీవో జిల్లా సెక్రెటరీ విక్రమ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఝాన్సీ, ఎఫ్‌ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T18:10:15+05:30 IST