Abn logo
Oct 19 2021 @ 23:49PM

ఖానాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఖానాపూర్‌ మండలంలోని రాజూరలో బతుకమ్మల నిమజ్జనం

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : ఖానాపూర్‌ మండలంలోని రాజూర, సింగాపూర్‌, పాత ఎల్లాపూర్‌, గోసంపల్లె, బాధనకుర్తి, సుర్జాపూర్‌, మస్కాపూర్‌, చందునాయక్‌తండా తదితర పల్లె గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజూరలో సర్పంచ్‌ లావణ్య రవింధర్‌, పాత ఎల్లాపూర్‌లో సర్పంచ్‌ స్వప్న చంద్రయ్యలు ఆద్వర్యంలో కొనసాగాయి. రంగురంగుల పూలు పేర్చి బతుక్మను అందంగా అలంకరించి తలపైన పెట్టుకొని ఊరేగింపుగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తు సమీ పంలో గల చెరువులో నిమజ్జనం చేసారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసారు.