గల్ఫ్‌ బాధితులను ఆదుకోకుండా బతుకమ్మ వేడుకలా?

ABN , First Publish Date - 2021-10-26T05:44:07+05:30 IST

గల్ఫ్‌ బాధితులను ఆదుకోకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుబాయిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు.

గల్ఫ్‌ బాధితులను ఆదుకోకుండా బతుకమ్మ వేడుకలా?
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌/నవీపేట, అక్టోబరు 25: గల్ఫ్‌ బాధితులను ఆదుకోకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుబాయిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవా రం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్‌ బాధితుల కోసం రూ.500ల కోట్ల వెల్ఫేర్‌ ఫండ్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గల్ఫ్‌ బాధితుడిని ఆదుకోలేద ని అన్నారు. దుబాయిలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వారిని ఆదుకోకుం డా.. వాళ్ల వద్దకే వెళ్లి ఏ మొఖంతో బతుకమ్మ ఆడారో జవాబు చెప్పాలని ఆయ న ప్రశ్నించారు. యాసంగిలో వరి పంట సాగు చేయవద్దని, వరి విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని సీఎం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పంటల సాగు అనేది రైతుల ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వరికి మద్దతు ధర ఇవ్వాలని, విత్తనాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశం లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూ పతిరెడ్డి, తాహెర్‌బిన్‌ హందాన్‌, నగేష్‌రెడ్డి, రామర్తిగోపి, విపుల్‌గౌడ్‌, నవీపేట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సుధాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, మహిపాల్‌  రెడ్డి, ఎస్‌కె బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:44:07+05:30 IST